సింగర్ సునిధి చౌహాన్ గురించి ఈ విషయాలు తెలుసా..
ఢిల్లీలో పుట్టి పెరిగిన సునిధి... అసలు పేరు నిధి.
ఢిల్లీలోని ‘గ్రీన్‌వే మోడ్రన్ స్కూల్’లో చదివింది.
ఆమె తండ్రి దుష్యంత్ కుమార్ చౌహాన్‌ది ఉత్తరప్రదేశ్. రంగస్థల కళాకారుడు. తల్లి గృహిణి.
తల్లి ప్రోద్బలం, ప్రోత్సాహంతోనే సునిధి సంగీత సాధన మొదలుపెట్టింది.
నాలుగేళ్ల వయసులో స్థానిక పాటల పోటీల్లో పాల్గొంది.
తండ్రి స్నేహితుల సలహాతో కాలక్షేపంగా కాకుండా సంగీతానికి ప్రత్యేకంగా సమయం కేటాయించింది.
పాఠశాల విద్య పూర్తవగానే చదువుకు స్వస్థి చెప్పింది. ఒక పక్క లైవ్ షోలు చేస్తూనే... మరోవైపు తన గాత్రానికి మెరుగులు అద్దుకుంది.
లతామంగేష్కర్‌కు వీరాభిమాని. ఆమె పాటలే సునిధికి ప్రేరణ.
ఓ వేదికపై సునిధి పాట విని ముగ్ధురాలైన నటి తబుస్సుమ్... తన షో ‘తబుస్సుమ్ హిట్ పరేడ్’లో అవకాశం కల్పించారు.
సంగీత దర్శకులు కల్యాణ్‌జీ, ఆనంద్‌జీలకు ఆమెను తబుస్సుమ్ పరిచయం చేశారు.
సునిధి గాత్రానికి ఫిదా అయిన కల్యాణ్‌జీ... ఆమెకు మంచి భవిష్యత్తు ఉందంటూ అభినందించారు. ‘నిధి’ పేరును సునిధిగా మార్చింది ఆయనే.
కల్యాణ్‌జీ బృందం ‘లిటిల్ వండర్స్’లో ప్రధాన గాయనిగా కొన్నేళ్లపాటు అనేక ప్రదర్శనలు ఇచ్చింది.
పదకొండేళ్ల వయసులో ‘లడకీ దివానీ దేఖో’ అంటూ ఉదిత్ నారాయణ్‌తో కలిసి ఆ చిత్రంలో ఆలపించిన గీతంతో సునిధి పాటల ప్రయాణం ప్రారంభమైంది.
మరో అప్డేట్‌లో సునిధికి సంబంధించిన మరిన్ని విషయాలు
Related Web Stories
షారుఖ్ ఆల్ టైమ్ బెస్ట్ మూవీస్
వరుణ్ తేజ్ ‘మట్కా’ ట్రైలర్ విడుదల
దీవాళి స్పెషల్‌గా వచ్చిన ఈ పోస్టర్స్ చూశారా..
ఓటీటీలోకి వచ్చేసిన ‘విశ్వం’