అగ్ర దర్శకుడు రాజమౌళి తన 13వ సినిమా మహేష్ బాబుతో చేస్తున్నారు. ఈ సినిమా భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది అని వార్తలు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమా ఇదే.
దర్శకుడిగా రాజమౌళి మొదటి సినిమా 'స్టూడెంట్ నంబర్ వన్', ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది.
రెండో సినిమా 'సింహాద్రి'లో కూడా ఎన్టీఆర్ కథానాయకుడు, ఈ సినిమా మొదటి సినిమా కన్నా పెద్ద విజయం సాధించింది. అలాగే తన కెరీర్ లో ఎన్టీఆర్ తోటే ఎక్కువ సినిమాలు, నాలుగు సినిమాలు చేసిన రాజమౌళి
తన నాలుగో సినిమా 'చత్రపతి' ప్రభాస్ కథానాయకుడు. ఈ సినిమా ప్రభాస్ ని స్టార్ ని చేసింది. తరువాత అదే ప్రభాస్ తో 'బాహుబలి' రెండు పార్టులు తీసి చరిత్ర సృష్టించాడు రాజమౌళి
సినిమా దర్శకుడిగా అవకముందు, రాజమౌళి 'శాంతి నివాసం' అనే సీరియల్ కి పనిచేశారు. ఆ సీరియల్ కి నిర్మాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.
రాజమౌళి 2001లో రమ ని వివాహం చేసుకున్నారు. వివాహం అయిన తరువాత రమ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాజమౌళి చేసిన అన్ని సినిమాలకి పని చేశారు.
రామ్ చరణ్ తో చేసిన 'మగధీర' రాజమౌళి కెరీర్ లో అతి పెద్ద విజయం. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. రాజమౌళి పేరు దేశం అంతా మారుమోగింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ తో చేసిన 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ అవార్డు గెలుచుకొని తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు రాజమౌళి
కమెడియన్ సునీల్ కథానాయకుడిగా 'మర్యాద రామన్న' అనే ఒక చిన్న సినిమా తీసి పెద్ద విజయం సాధించిన రాజమౌళి
రాజమౌళి చేసిన పన్నెండు సినిమాలు విజయం సాధించాయి. ఇలా వరస విజయాలను చవిచూసిన దర్శకులు ఎవరైనా వున్నారంటే బహుశా అది దర్శకుడు రాజమౌళి ఒక్కడే కావచ్చు