సినిమాల్లోకి రాకముందు..  ఈ హీరోలు ఏం చేసేవారో తెలుసా?

అంధాదూన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న నటుడు ఆయుష్మాన్‌ ఖురానా

డిగ్రీ పూర్తయిన వెంటనే ‘బిగ్‌ ఎఫ్‌ఎమ్‌’లో రేడియో జాకీగా అవకాశం వచ్చింది. తనదైన స్టైల్‌లో శ్రోతలను ఉర్రూతలూగించేవాడు

కొద్ది కాలానికే మంచి గుర్తింపు లభించడంతో వీడియో జాకీగా మారాడు. ఆపై ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ షోతో టెలివిజన్‌ యాంకరింగ్‌ మొదలెట్టి

 ‘మ్యూజిక్‌ కా మహా ముఖాబ్లా’, ‘జస్ట్‌ డ్యాన్స్‌’ షోలతో ప్రేక్షకులకు  చేరువయ్యాడు. ఆ తర్వాత ‘ఖయామత్‌’ సీరియల్‌లో సపోర్టింగ్‌. ‘ఏక్‌ థీ రాజకుమారి’లో విలన్‌గా చేశాడు

2012లో విక్కీ డోనర్ చిత్రంతో  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి  2018లో అంధాదూన్ మూవీతో స్టార్ అయ్యాడు

మన ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. అతని మొదటి సంపాదన పదిహేనేళ్లకే ప్రారంభమైంది

అప్పట్లో రూ.200 జీతానికి ఒక ట్రావెల్‌ ఏజెన్సీతో పని చేసేవాడు. తర్వాత ఢాకాలో ఓ హోటల్‌లో చెఫ్‌ కమ్‌ వెయిటర్‌గా చేశాడు

ఆపై బ్యాంకాక్‌ లో ఐదేళ్లు థాయ్‌ బాక్సింగ్‌ నేర్చుకుని ఇండియాకు వచ్చి పొట్టకూటి కోసం ఆభరణాలు విక్రయించేవాడు

ఢిల్లీలో కొన్న ఆభరణాలను ముంబాయి తీసుకెళ్లి అమ్మేవాడు. ఆపై మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు

అలాగే లైట్‌మ్యాన్‌, స్టంట్‌మ్యాన్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. ఇప్పుడు బాలీవుడ్ లో అగ్ర స్థానంలో దూసుకుపోతున్నాడు

విజయ్ సేతుపతి సినిమాల్లోకి రాక ముందు డిగ్రీ అవ్వగానే ఇంటి ఆర్థిక బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు

కాలేజీ పూర్తై వారం కాక ముందే ఓ నిర్మాణ రంగ సంస్థలో అకౌంట్‌ అసిస్టెంట్‌గా, ఆపై బట్టల దుకాణంలో సేల్స్‌మ్యాన్‌గా, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో క్యాషియర్‌గా, ఫోన్‌ బూత్‌ ఆపరేటర్‌గా పనిచేశారు

నాలుగింతలు జీతం వస్తుందని దుబాయిలో రెండేళ్లు అకౌంటెంట్‌గా పని చేశాడు

2003లో ఇండియాకు వచ్చి ఇంటీరియర్‌ డెకరేషన్‌ బిజినెస్‌ ప్రారంభించాడు. లాభాలు రాక ఓ మార్కెటింగ్‌ కంపెనీలో పనిచేశాడు

 ఈ త‌ర్వాత షార్ట్ ఫిలింస్ ప్రారంభించి.. 2011వ‌ర‌కు సినిమాల్లో చిన్న పాత్ర‌లు చేసి 2012లో పిజ్జా సినిమాతో స్టార్‌గా మారాడు