అక్కినేని వారి కొత్త కోడలు.. శోభిత గురించి మీకు తెలుసా!
తెలుగు వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు శోభిత దూళిపాళ
ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ
బాల్యం, విద్యాభ్యాసం విశాఖ పట్టణంలో గడిచింది
ఆపై ముంబైకి షిఫ్ట్ అయి లా చేసింది
అదే సమయంలో కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది
2013లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం గెలుచుకుని వార్తల్లో నిలిచింది
ఆపై మిస్ ఎర్త్ పోటీల్లో పాల్గొన్నా నిరాశే ఎదురైంది
2018లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన
రమన్ రాఘవ్2.0 అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది
తర్వాత సైఫ్ అలీఖాన్ కాలాకండి, చెఫ్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది
2018లో అడవి శేష్ గూడాచారి సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది
తర్వాత బాలీవుడ్‌లోనూ, ఇక్కడా సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు
ఈ క్రమంలో 2019లో అమెజాన్ ఓటీటీ సంస్థ నిర్మించిన మేడ్ ఇన్ హెవెన్
సిరీస్‌తో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది
అందులో బోల్డ్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది
ఆపై వరుసగా సిరీస్‌లు, సినిమాలతో ఫుల్ బిజీగా మారింది
గత సంవత్సరం అనీల్ కపూర్‌తో చేసిన నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1, 2 సినిమాలు
శోభితకు మంచి పేరు తీసుకువచ్చాయి
తెలుగులో చివరగా అడవి శేష్ మేజర్ సినిమాలో నటించింది
ఇదిలా ఉండగా శోభిత
హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ నటించిన
మంకీమ్యాన్ సినిమా ఈ ఏడాది మన దేశం మినహా
అన్ని దేశాలలో విడుదలై మంచి విజయం సాధించింది
ప్రస్తుతం సితార అనే హిందీ సినిమాలో నటిస్తోంది
అదేవిధంగా ఈమధ్య వచ్చిన ప్రభాస్ కల్కి సినిమాలో
కథానాయిక దీపికకు డబ్బింగ్ చెప్పి మెప్పించడం విశేషం
తాజాగా గత కొంత కాలంగా
తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ
అక్కినేని వారి అబ్బాయి నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుంది
ఇప్పుడు గత రెండు రోజులుగా
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా
ఏ ఒక్కరిని పలకరించినా
ఈ జంట గురించే మాట్లాడుకుంటున్నారు
బెస్టాఫ్ లక్ నాగ చైతన్య,శోభిత
Related Web Stories
ఇనేయ.. ఈ డస్కీ బ్యూటీ గురించి మీకు తెలుసా
దేవర పాట.. జాన్వీ గత్తర లేపుతుందిగా!
కేరళ (వాయినాడ్) వరదలు.. ఎవరెంత విరాళం ఇచ్చారంటే!
ఫిలింఫేర్ అవార్డులు.. టాలెంట్ చూపిన ముద్దుగుమ్మలు