యథార్థ కథలకు రూపాన్నిచ్చిన దర్శకుడు
శ్యామ్ బెనెగల్ ఇక లేరు
1934లో డిసెంబర్ 14న హైదరాబాదు తిరుమలగిరిలో జన్మించారు
ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే సహా పలు అవార్డులు వరించాయి
తెలంగాణ ఆత్మను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు శ్యామ్ బెనెగల్
ఆయన రూపొందించిన ‘అంకుర్’, ‘నిషాంత్’, ‘సుస్మన్, ‘మండి’, ‘వెల్ డన్ అబ్బా’ చిత్రాల నేపథ్యం తెలంగాణ కావడం విశేషం
1970-80ల దశకంలో పారలల్ సినిమాకు ఊపిరి పోశారు శ్యామ్
పేరున్న నటీనటుల జోలికి పోకుండా కొత్త తారలకు అవకాశాలు ఇస్తూ సినిమాలు రూపొందించారు
శ్యామ్ బెనెగల్ తెలుగు వాడైనా తెలుగులో ‘అనుగ్రహం’(1978) అనే ఒకే ఒక్క చిత్రం తీశారు
వాణిశ్రీ పారలల్ సినిమాలో తను కూడా నటించాలనే తపనతో ‘అనుగ్రహం’(1978) చిత్రం లో నటించారు
కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు
భారతీయ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది
Related Web Stories
తమన్నా లైఫ్ మార్చిన సినిమా..
హిట్టు కొట్టినా లక్కు కోసం బ్యూటీ వెయిటింగ్..
శ్రీదేవి ని మైమరిపిస్తున్న ఖుషి కపూర్
గేమ్ ఛేంజర్ చూశా..ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తా