సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!
సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?
సారా పేరు వెనక ఓ చిన్న కథ ఉంది. 1997లో సచిన్ సారథ్యంలోని భారత్ జట్టు పాకిస్తాన్‌ను ఓడించి ‘సహారా కప్’ గెలుచుకుంది.
సచిన్ అప్పుడే తొలిసారి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారట. అదే ఏడాది పుట్టడంతో.. సహారా కనెక్ట్ అయ్యేలా ‘సారా’ అని పేరు పెట్టారు.
తమ్ముడు అర్జున్ సారా కంటే రెండేళ్లు చిన్నవాడు. అర్జున్ అంటే సారాకు ప్రాణం.
సారా, అర్జున్‌ల మధ్య మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవట. సారా సీక్రెట్స్ అన్నీ అర్జున్ తెలుసట. ఈ విషయం సారానే చెప్పింది.
అర్జున్‌కి ఏ విషయంలో ఎలాంటి సందేహం వచ్చినా.. సారానే అడుగుతాడు.
ఆసక్తికర విషయం ఏమిటంటే ఇప్పటి వరకు వారి మధ్య అలకలు గానీ, కొట్లాటలు గానీ జరగలేదట.
స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడమన్నా, విహారయాత్రల్ని ఆస్వాదించడమన్నా సారాకు ఎంతో ఇష్టం.
కొత్తకొత్త ప్రదేశాలను సందర్శించి, అక్కడ వివిధ సంస్కృతులకు చెందిన వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడాన్ని ఇష్టపడతానంటోంది.
ఎప్పుడైనా ఒత్తిడికి గురైనా, మనసు బాగోకపోయినా వెంటనే సముద్ర తీరప్రాంతాలకు వెళ్తుందట ఈ బ్యూటీ.
సోలో ప్రయాణాల కన్నా తన గాళ్స్‌గ్యాంగ్‌ని వెంటబెట్టుకొని తిరగడమంటేనే ఇష్టమంటోంది.
చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమంటే సారాకు ఆసక్తి ఎక్కువ.
సమాజానికి మనవంతుగా ఎంతో కొంత తిరిగివ్వాలని ఎప్పుడూ అమ్మానాన్న చెప్తుంటారని.. నిజానికి వారివల్లే తనకు దాతృత్వ గుణం అలవడిందని అంటోంది.
ఇటీవల ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సారా..
ఇప్పటికే ఆ ఫౌండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని పేద పిల్లలకు ఉచిత వైద్యం, క్రీడలు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని..
ఈ సేవలను మరింతగా విస్తరించేందుకు కృషి చేయాలనుకుంటున్నానని సారా తెలిపింది.
Related Web Stories
నభ 'నాభి' అందాలు
విమర్శల్ని పట్టించుకోను: ‘గేమ్ చేంజర్’ హీరోయిన్
తనకు నాకు పోటీనా.. వింతగా ఉంది
పాయల్ రాజ్‌పుత్ పేరు మారిపోతుందా..