రతన్ టాటా.. నిర్మించిన ఆ ఒక్క‌ సినిమా గురించి మీకు తెలుసా!

టాటా.. ర‌త‌న్ టాటా ఈ పేరంటే తెలియ‌ని భార‌తీయుడంటూ ఉండ‌రు

ప్ర‌జ‌ల‌తో అంత‌గా  పెన‌వోసుకున్న బంధం ఆయ‌న‌ది

అలాంటి వ్య‌క్తి ఈ తెల్ల‌వారుజామున కన్నుమూయడంతో ప్ర‌జ‌లు  క‌న్నింటి ప‌ర్యంతం అవుతున్నారు

ఆయ‌న దేశానికి, ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌ల‌ను కొనియాడుతున్నారు

బాలీవుడ్‌, టాలీవుడ్ సెల‌బ్రిటీలు చాలా మంది త‌మ సామాజిక మాధ్య‌మాల ద్వారా సంతాపం తెలియ‌జేస్తున్నారు

అయితే ఇప్ప‌టికే అన్ని రంగాల్లో విజ‌యబావుటా ఎగుర‌వేసిన టాటా

పారిశ్రామిక రంగంలో కొత్త ఒర‌వ‌డి సృష్టించిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే

అయితే వారికి టాటా స్టీల్‌, టెలికాం, ఐటీ వంటి ప్ర‌ముఖ కంపెనీలు మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలుసు

కానీ ఎంట‌ర్ టైన్‌మెంట్ లోనూ అడుగు పెట్టిన సంగ‌తి చాలా మందికి తెలియ‌దు

2004లో అమితాబ్ బ‌చ్చ‌న్, జాన్ అబ్ర‌హం, బిపాస‌బ‌సు ప్ర‌ధాన పాత్ర‌ల్లో

ఏత్బార్ అనే హిందీ సినిమాకు ఆయన సహ నిర్మాత‌గా వ్యవహరించారు

హాలీవుడ్‌ ఫియ‌ర్ చిత్రాన్ని రిమేక్ చేస్తూ విక్రమ్ భట్ దర్శకత్వం వ‌హించాడు

రూ.8 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.9.50 కోట్లు మాత్రమే రాట్టి

టాటా నిర్మాతగా వ్యవహరించిన ఒకే ఒక్క సినిమాగా చ‌రిత్ర‌లో నిలిచింది

ప్ర‌స్తుతం టాటా ప్లైగా టీవీ చాన‌ళ్లు, ఓటీటీలు అందిస్తూ దేశంలో ఆగ్ర‌భాగాన ఉంది