శ్రీలీలకు అదిరిపోయే ఆఫర్..

తెలుగులో వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్‌ రేస్‌లో దూసుకెళుతోంది శ్రీలీల.

‘భగవంత్ కేసరి’ ఆమెకి మరింత పేరు తెచ్చిపెట్టింది.

టాలీవుడ్‌లో టాప్ రేపిన శ్రీలీల ప్రస్తుతం కోలీవుడ్‌పై కన్నేసింది.

ఆమెకిప్పుడు కోలీవుడ్‌లో బంపరాఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌తో కలిసి హీరోయిన్‌ శ్రీలీల నర్తించనున్నట్టు సమాచారం.

తమిళం, తెలుగు భాషా చిత్రాలకు సంగీత స్వరాలను సమకూర్చుతూ ఎంతో బిజీగా ఉన్నాడు అనిరుధ్‌.

ఇప్పుడాయన ఓ ఆల్బమ్ సాంగ్‌ను రూపొందించనున్నారు.

దీనికి సంగీతం సమకూర్చి నేపథ్యగానం చేసి, నటించనున్నారు. 

ఈ పాటలో తన సరసన నటించేందుకు శ్రీలీలను ఎంపిక చేసినట్టు సమాచారం. 

ప్రస్తుతం శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకునేందుకు పలువురు కోలీవుడ్ దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.