హాట్ బ్యూటీ అనసూయ చెప్పుకొచ్చిన కొన్ని సీక్రెట్స్!
బయట చూసే అనసూయ వేరు. ఇంట్లో అనసూయ వేరు. ఇంట్లో చాలా సింపుల్‌గా ఉంటా. ఇంట్లో ఎలా ఉండాలో... బయట ఎలా ఉండాలో బాగా తెలిసిన అమ్మాయిని.
నా చుట్టూ ఉన్నవాళ్లు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నా మంచి కోరతారు. అందుకే కెరీర్ బిగినింగ్ నుంచీ నేను సెక్యూర్ కండిషన్‌లోనే ఉన్నా.
ఆ ఐదు రోజులూ అలాగే ఉంటా: చిన్నప్పటి నుంచీ మా ఇంట్లో మడి ఆచారం ఉంది. నేనూ అదే పద్దతిలో ఉంటా. నెలసరి ఐదు రోజులు కూడా ఇంట్లో దూరంగా కూర్చుంటా.
పీరియడ్స్ టైమ్‌లో ఇంట్లో వస్తువులను కూడా తాకను. మా అత్తగారు ఇంకా ఏ రోజుల్లో ఉన్నావని నన్ను ఆటపట్టిస్తుంటారు. ‘నేనింతే’ అని నవ్వుతూ చెబుతా.
అలా అంటే కోపం: ఫిక్స్‌లాయిడ్‌లో హెచ్‌ఆర్‌గా పని చేసిన సమయంలో చాలామంది అనుష్క శెట్టిలా ఉన్నానని అనేవారు. అలా అంటే చాలా కోపం వచ్చేది. నన్ను నాలాగా చూడండి. ఎవరితోనో పోల్చడం నాకు నచ్చదు విసురుగా చెప్పేదాన్ని.
ఫిట్‌నెస్ సీక్రెట్: నచ్చింది మోహమాటం లేకుండా లాగించేస్తా. దానిని అరగ్గొట్టడానికి కసరత్తులు చేస్తా. ప్రతిరోజు జిమ్‌కెళ్లి వర్కవుట్స్ చేస్తా. రోజుకి మూడుసార్లు గ్రీన్ టీ తాగుతా.
డ్రైవింగ్‌లో స్ట్రిక్ట్ : స్కూటీ, ఎన్‌ఫీల్డ్ బాగా డ్రైవ్ చేస్తా. ఎన్‌ఫీల్డ్ వేసుకుని బయట తిరుగుతా! రోడ్డు మీదకి బైక్ తీసుకెళ్తే దారి పొడవునా ఎవరో ఒకర్ని తిడుతూనే ఉంటా.
రోడ్డుపై నా ముందు వెళ్లేవాళ్లు ఇండికేటర్ వెయ్యకుండా అడ్డదిడ్డంగా వెళ్తుంటే ఆపి మరీ తిడతా. కానీ ఎవర్నీ కొట్టలేదు.
‘ఆర్య-2’లో ఓ పాత్ర కోసం సుకుమార్ సంప్రదించారు. అది చేసుంటే రంగమ్మత్త పాత్ర నా దగ్గరకు వచ్చేది కాదు. నటిగా ఇంత పాపులర్ అయ్యేదాన్ని కాదు.
జనాలందరూ రంగమ్మత్త పాత్ర గురించి గొప్పగా మాట్లాడుతుంటే 100 శాతం ఎఫర్ట్ పెట్టి చేసుంటే ఇంకెంత పేరొచ్చేదో అని ఇప్పుడు అనుకుంటున్నా.