అది తట్టుకోలేక థెరపీ కూడా తీసుకున్నా: అనన్యా పాండే

అటు వెబ్‌ సిరీస్‌లు.. ఇటు సినిమాలతో దూసుకుపోతున్నారు బాలీవుడ్‌ నటి అనన్యా పాండే.

‘లైగర్‌’ చిత్రంతో తెలుగువారికి సుపరిచితమైన అనన్య.. 

ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్‌ బర్ఖా దత్‌తో ‘వియ్‌ ద విమెన్‌’ ఫెస్టివల్‌ ఏడవ ఎడిషన్‌లో మాట్లాడారు. 

అందులో బర్ఖా ‘మీకు ఎదురైన అత్యంత ఘోరమైన ట్రోలింగ్‌ ఏంటి’ అని అడిగారు. 

అందుకు అనన్య బదులిస్తూ.. ‘ట్రోలింగ్‌ సమస్య నాకెన్నో సార్లు ఎదురైంది. 

కెరీర్‌ ఆరంభంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. 

సోషల్‌ మీడియాలో నా పేరుతో ఓ వ్యక్తి ఫేక్‌ అకౌంట్‌ తయారు చేసి 

అందులో నా గురించి లేనిపోనివి రాసేవాడు. అవి చూసిన నేను.. 

ఈ కాలంలో ఇవన్నీ ఎవరు నమ్ముతారులే అనుకునేదాన్ని. 

అయితే వాటిని అందరూ గమనిస్తుంటారని తర్వాతే అర్థమైంది. 

ఒక చిన్న విషయం.. అది అబద్దమో.. నిజమో తెలిసేలోపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోతుంటుంది. 

అంతేకాకుండా కెరీర్‌ తొలినాళ్లలో తరచూ నాపై నెగెటివ్‌ కామెంట్స్‌ వచ్చేవి. 

వాటిని మొదట్లో పట్టించుకోకపోయినా కొంతకాలం తర్వాత గుర్తొచ్చి ఇబ్బంది పెట్టేవి. 

తట్టుకోలేక థెరపీ కూడా తీసుకున్నా. దాంతో నేను బెటర్‌గా ఫీల్‌ అయ్యేదాన్ని. 

నా స్కూలింగ్‌ డేస్‌లో కూడా నన్ను బాడీ షేమింగ్‌ చేసేవారు’ అని చెప్పారు.