గోవాలో గ్రాండ్‌గా 'అల్లు స్నేహ రెడ్డి' బర్త్ డే! 

అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహ రెడ్డి 39వ బర్త్ డేని బన్నీ గోవాలో గ్రాండ్‌గా జరిపారు.

ఆమె ప్రముఖ బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రథమ సంతానం.

బాల్యంలో హైదరాబాద్ లోని  ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివారు.

 బ్యాచిలర్స్ డిగ్రీ కోసం కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ‌ లో ఎలక్ట్రానిక్స్   & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌ చేసింది.

ఇండియా తిరిగి వచ్చిన తర్వాత సైంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SIT)లో అకడమిక్ & ప్లేస్‌మెంట్ సెల్    డైరెక్టర్‌గా పనిచేశారు.

అలాగే  ' SPECTRUM ' అనే కాలేజీ మ్యాగజైన్‌కి చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు.

బన్నీ ఒక ఫ్రెండ్ పెళ్ళిలో స్నేహని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు.

 కొన్ని రోజులకే స్నేహకి ప్రపోజ్ చేయడంతో 2011లో పెద్దలు వీరిద్దరి పెళ్లి నిర్వహించారు.

వీరిద్దరూ  2014లో ఆయాన్, 2016లో అర్హకి జన్మనిచ్చారు.

 ఈ కపుల్స్ ఇద్దరు ఒకరి పేరుని మరొకరు టాటూ వేయించుకున్నారు.