పుష్ప 2 ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుండి శనివారం ఉదయం విడుదలయ్యారు.
ఆయనను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. ఆ పత్రాలు సకాలంలో జైలుకు చేరకపోవడంతో అల్లు అర్జున్ విడుదల వాయిదా పడింది.
కోర్టు ఉత్వర్వులు అప్‌లోడ్ చేసేసరికి రాత్రి 10.30 గంటలు దాటిపోవడంతో ఆయనను శనివారం ఉదయం విడుదల చేస్తామని జైలు అధికారులు ప్రకటించారు.
దీంతో రాత్రంతా ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
సరైన బెయిల్ పత్రాలు సమర్పించడంతో..శుక్రవారం ఉదయం ఆయనని విడుదల చేశారు.
అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా విడుదల చేశారు.