సంధ్య థియేటర్ ఘటనలో
అల్లు అర్జున్ అరెస్ట్..
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది.
శుక్రవారం పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు.
తాజాగా ఈ కేసులపై నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు.
బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కాని ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదు నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది.
అల్లు అర్జున్ వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.
మరోవైపు పుష్ప- 2 ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృతికి, తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమానులు తెలిపారు.
తమపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ యజమానురాలు రేణుకాదేవి, ఇతరులతో పాటు సంధ్య సినీ ఎంటర్‌ప్రైజ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Related Web Stories
ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది
ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్
భారత్ లో అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన చిత్రాలు ఏవో తెలుసా?
లుక్స్ తో అదరగొడుతున్న ప్రియాంక