నేటితరం ప్రేమికుల శృంగారంపై
ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్
ఒక మహిళ జీవితంలో విడాకులు లేదా బ్రేకప్ అనేది ఒక బెస్ట్ మూవ్‌మెంట్ అని అంటోంది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి.
‘గట్టాకుస్తి’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ మలయాళ భామ
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులు, బ్రేకప్‌పై ఆసక్తికర, ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.
‘ఒక మహిళ జీవితంలో విడాకులు లేదా బ్రేక్ అనేది బెస్ట్ మూవ్‌మెంట్‌గా చూడాలి.
వ్యక్తిగత పురోభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయాలకు వెళుతుంటారు.
వ్యక్తిగత ఎదుగుదలకు ఇది ప్రారంభంగా భావించాలి.
పాతతరం ప్రేమికులు వివాహానికి ముందు శృంగారంలో పాల్గొంటే వారు వెంటనే పెళ్ళి చేసుకునేవారు.
కానీ, నేటితరం ఆలోచనా తీరు పూర్తిగా మారిపోయింది.
ఎవరూ ఆ విషయంలో మాటపై నిలబడటం లేదు.
ఒకవేళ ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకుంటే వివాహితులైనప్పటికీ
దానినుంచి బయటపడి జీవితంలో పైకి వచ్చేందుకు దృష్టిసారించాలి’ అని సూచించారు.
కాగా, ఐశ్వర్య లక్ష్మి చేసిన ఈ కామెంట్స్‌ను పలువురు స్వాగతిస్తుంటే
మెజార్టీ వర్గం మాత్రం ఆమె వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తుంది.
Related Web Stories
చూపులతోనే కట్టిపడేస్తున్న లక్కీ భామ మీనాక్షి
నేల పైనే అందాలను ఆరబోస్తున్న 'కల్కి' భామ
తలకిందులుగా.. మృణాల్తో మాములుగా ఉండదు
లుక్స్ తోనే హీట్ ఎక్కిస్తున్న రకుల్ ప్రీత్