ఆల్ఫా కోసం.. శార్వరి క‌స‌ర‌త్తులు

ఈ మ‌ధ్య బీ టౌన్‌లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న న‌టి శార్వరి

 తాజాగా త‌ను న‌టించిన చిత్రం ముంజ్య ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాక

రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టి సంచ‌ల‌నం సృష్టించింది

దీంతో అమ్మ‌డి పేరు మ‌రింత‌గా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది

ఈ క్ర‌మంలోనే బాలీవుడ్‌లో బంఫ‌రాఫ‌ర్ ప‌ట్టేసింది

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్స్  అల్ఫా సినిమాలో ఓ పాత్ర‌కు ఎంపికైంది

ఇప్ప‌టికే అలియా భ‌ట్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయింది

 ఈ నేప‌థ్యంలోనే శార్వరి కూడా షూటింగ్‌కి సిద్ధమవుతూ హాట్‌ మండే మోటివేషన్ అంటూ

త‌ను సినిమా కోసం చేస్తున్న క‌స‌ర‌త్తుల‌ను వివ‌రిస్తూ ఓ పోస్ట్ చేసింది

ఆ పోస్టు తన ఫ్యాన్స్, జనాలను కూడా మోటివేట్‌ చేసేలా ఉంది

దీంతో ఆమె పెట్టిన పోస్టుకు  లైకుల పరంపర కొనసాగుతోంది

ప్రతిరోజూ వర్కవుట్‌ చేస్తే ఎంత ఫిట్‌గా ఉంటారో ఆమె ఫొటోలు చెబుతున్నాయి

శార్వరి ప్రస్తుతం జాన్ అబ్ర‌హంతో  వేదా చిత్రంలో నటిస్తోండ‌గా

హృతిక్ రోష‌న్, Ntr కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న వార్ 2లో

ఎన్టీర్‌కు జోడీగా శార్వరి  న‌టిస్తోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి