ఉప్పొంగే అందాల‌తో.. ఉరుకులు పెడుతున్న బ‌జ్జీల పాప‌

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో బాగా హాడావుడి చేస్తోంది కుషిత క‌ల్ల‌పు

మ‌న ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించే ఈ హైద‌రాబాదీ తెలుగు సోయ‌గం 

ఎలాంటి డ్రెస్‌లోనైనా ఒదిగిపోయి త‌న అందంతో మెస్మ‌రైజ్ చేస్తోంది 

చీర‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించే ఈ అచ్చ తెలుగు అందం

ర‌క‌ర‌కాలుగా హోయ‌లు పోతూ మ‌గ పుంగ‌వుల మ‌తులు పొగొడుతోంది 

శారీనే కాదు మోడ్ర‌న్‌ డ్రెస్సుల్లోనూ నేనేం త‌క్కువ కాదు అన్న‌చందాన

 త‌న మార్క్ డ్రెస్సింగ్‌తో క‌వ్విస్తోంది 

అయితే.. గతంలో మోడ‌ల్‌గా అంతంత మాత్రమే పేరున్న‌ కుషితకు

ఏ ముహుర్తానా ఆమె పేరు డ్ర‌గ్స్ కేసులో బ‌య‌ట‌కు వ‌చ్చిందో కానీ..

 అదే ఆమె పాలిట క‌ల్ప‌వృక్షంగా మారి బాగా పాపుల‌ర్‌ను చేసింది

నేను డ్ర‌గ్స్ తీసుకోలేదు.. చీజ్ బ‌జ్జీలు తిన‌డం కోస‌మే ప‌బ్‌కు వెళ్లానంటు

చెప్పిన‌ మాట‌ల‌తో.. ఒక్క‌సారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది

ట్రోల‌ర్స్ చేతిలో ఓ రేంజ్‌లో రోస్ట్ అయింది 

ఇక ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియా స్టార్‌గా మారిపోయింది

అదే సమయంలో ఈ భామ‌ త‌న‌కు వ‌చ్చిన ఫేమ్‌ను చేజార్చుకోకుండా

సోష‌ల్ మీడియాలో త‌న పేరు, వీడియోలు

 రెగ్యుల‌ర్‌గా ఉండేలా, క‌నిపించేలా ట్రెండయ్యేలా చూసుకుంటుంది

అదే ఊపులో రెండు మూడు సినిమాల్లో క‌థానాయిక‌గా చేసింది

ఇప్పటికే ఛాంగురే బంగారురాజా, నీతోనే నేను సినిమాల్లో న‌టించిన ఈ చిన్న‌ది 

ఈ సంవ‌త్స‌రం బాబు నెంబ‌ర్‌వ‌న్ బుల్షిట్ గాయ్ చిత్రంలో న‌టించింది

ప్ర‌స్తుతం మ‌నోహ‌రం అనే  మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది

 అన్ని సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాంల్లో కలిపి

మిలియ‌న్ పైనే ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్న కుషిత క‌ల్ల‌పు

స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా డిఫరెంట్ స్టైల్లో

త‌న అంద‌చందాల‌తో హోయ‌లు ఒలికిస్తూ నిత్యం వీడియోల‌తో హల్‌చ‌ల్ చేస్తోంది

రోజుకు క‌నీసం ఒక‌టి, రెండు చొప్పున వీడియోల‌ను, ఫొటోల‌ను

ఇన్ స్టా, ఎక్స్‌ల‌లో పోస్టు చేస్తూ

ఫాలోవ‌ర్స్‌ను, అభిమానుల‌ను అల‌రిస్తోంది

చూడాలి మున్ముందైనా ఈ అమ్మ‌డికి సినిమా అవ‌కాశాలు పెరుగుతాయో లేదో