కస్తూరి తెలుగువారికి సారీ చెప్పిందిగా..

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నటి కస్తూరి సారీ చెప్పింది.

ఈ నెల 3న తెలుగు ప్రజలను ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. 

ఆ రోజున నేను మాట్లాడిన ముఖ్యమైన అంశం ఈ వివాదంతో మరుగునపడిపోయింది.

రెండు రోజులుగా నాకు అనేక బెదిరింపులు వస్తున్నాయి. 

ఇవి సమస్యను మరింత తీవ్రతరం చేసేలా ఉన్నాయి. 

భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మనదేశంలో నేను నిజమైన జాతీయవాదిని. 

కులమత, ప్రాంతీయభేదాలకు దూరంగా ఉండే నేను తెలుగు ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉన్నాను.

ఇది నాకు లభించిన మహాభాగ్యంగా భావిస్తాను.

నాయకర్‌లు, కట్టబొమ్మన్‌ల పేరు ప్రఖ్యాతులు, త్యాగరాజ కీర్తనలను వింటూ పెరిగాను. 

నా తెలుగు సినీ ప్రయాణాన్ని ఎంతగానో గౌరవిస్తాను. 

తెలుగు ప్రజలు నాకు పేరు ప్రఖ్యాతులతోపాటు మంచి ప్రేమాభిమానాలను కూడా పంచారని కస్తూరి తెలిపింది.

ప్రస్తుతం ఆమె తెలుగు ప్రజలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై.. 

చెన్నై ఎగ్మోర్‌ పోలీస్ స్టేషన్‌లో నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే.