బిగ్‌బాస్ మోనాల్.. క‌ల‌ర్‌ఫుల్ సెల‌బ్రేష‌న్స్

బిగ్‌బాస్ బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్

మోనాల్ గ‌జ్జ‌ర్ త‌న టాలెంట్‌ను, భ‌క్తిని

మ‌రోసారి ప్ర‌ద‌ర్శించింది

ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా

త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో న‌వ‌రాత్రి

వేడుక‌ల్లో ఆట‌పాట‌లతో అల‌రించింది

సాంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో

పూజ‌లు, గాబ్రా డ్యాన్సుల‌తో ఉత్స‌వాల‌ను క‌ల‌ర్‌ఫుల్‌ చేసింది

ఇందుకు సంబ‌ధించిన ఫొటోల‌ను

ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా బాగా వైర‌ల్ అవుతున్నాయి

ఇదిలాఉండ‌గా బిగ్‌బాస్ నుంచి వ‌చ్చాక‌

మోనాల్‌కు పేరు వ‌చ్చిన‌ప్ప‌టికీ సినిమా అవ‌కాశాలు అంత‌గా త‌లుపు త‌ట్ట‌లేదు

కానీ గుజ‌రాత్‌లో  వ‌రుస ఛాన్సులతో దూసుకెళుతుంది

 తెలుగులో చివ‌ర‌గా ..

బెల్లంకొండ శ్రీను అల్లుడు అదుర్స్ చిత్రంలో

ఓ పాట‌లో క‌నిపించిన మోనాల్

త‌ర్వాత ఏ తెలుగు సినిమాలో న‌టించ‌లేదు

కొన్ని టీవీ షోలు మాత్రం చేసింది

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది