ZEE5లో ‘రెక్కీ’.. ఎప్పటి నుంచి అంటే..!

ABN , First Publish Date - 2022-06-02T03:20:46+05:30 IST

ఇటీవల ‘గాలివాన’ వెబ్ సిరీస్‌తో అందరినీ అలరించిన ZEE5.. ఇప్పుడు వీక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు మరో కొత్త వెబ్ సిరీస్‌‌తో సిద్ధమైంది. ‘రెక్కీ’ (Recce) అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ సిరీస్

ZEE5లో ‘రెక్కీ’.. ఎప్పటి నుంచి అంటే..!

ఇటీవల ‘గాలివాన’ వెబ్ సిరీస్‌తో అందరినీ అలరించిన ZEE5.. ఇప్పుడు వీక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు మరో కొత్త వెబ్ సిరీస్‌‌తో సిద్ధమైంది. ‘రెక్కీ’ (Recce) అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ సిరీస్ 1990ల నాటి గ్రిప్పింగ్ పీరియడ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. 25 నిమిషాల వ్యవధితో మొత్తం 7 ఎపిసోడ్‌లుగా జూన్ 17 నుండి ఈ సిరీస్ ప్రసారం కానుంది. పోలూరు కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌కు సంబంధించి తాజాగా మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.  


ఈ సందర్భంగా దర్శకుడు పోలూరు కృష్ణ (Poluru Krishna) మాట్లాడుతూ.. ‘‘తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలుంటాయి. కొత్తగా నియమించబడిన లెనిన్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్ ‘రెక్కీ’లో ఎక్స్‌పెర్ట్ అయిన పరదేశిల మధ్య ఈ కథ నడుస్తుంది. 1992లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ (Tadipatri Municipal Chairman) వరదరాజులు (Varadarajulu) హత్యకు ఎలా ప్లాన్ చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ లెనిన్ (Lenin) ఎలా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి.. చేదించాడు అనేది కథ యొక్క ప్రధానాంశం..’’ అని తెలిపారు.


ఇక విడుదలైన మోషన్ పోస్టర్‌ చూస్తుంటే.. ఇందులో ఉత్కంఠభరితమైన డ్రామాతో పాటు ట్విస్ట్, టర్న్‌లతో.. రోలర్-కోస్టర్ రైడ్‌లా కనిపిస్తుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌‌లో.. తాడిపత్రిలో పేరుమోసిన ఫ్యాక్షన్ హింస అంశం చుట్టూ అన్వేషించబడినట్లు కనిపిస్తోంది. శ్రీరామ్ (Sriram), శివబాలాజీ (Sivabalaji) ఇంతకు ముందు కనిపించని పాత్రలలో కనిపిస్తున్నారు. గ్రామీణ ఫ్యాక్షన్ క్రైమ్ డ్రామాతో వస్తున్న ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించడం ఖాయం అని జీ5 యాజమాన్యం తెలుపుతుంది.



Updated Date - 2022-06-02T03:20:46+05:30 IST