సల్మాన్ ఖాన్ మంచి స్నేహితుడు, ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటారు : జరీన్ ఖాన్

ABN , First Publish Date - 2022-01-20T22:13:40+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎంతో మంది హీరోయిన్లను బీ టౌన్‌కు పరిచయం చేశారు. వెండితెరకు అలా పరిచయం అయిన

సల్మాన్ ఖాన్ మంచి స్నేహితుడు, ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటారు : జరీన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎంతో మంది హీరోయిన్లను బీ టౌన్‌కు పరిచయం చేశారు. వెండితెరకు అలా పరిచయం అయిన హీరోయిన్‌లలో జరీన్ ఖాన్ ఒకరు. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘‘వీర్’’తో వెండితెరపైకి కథానాయికగా జరీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అనంతరం దక్షిణాది చిత్రాల్లో నటించినప్పటికి ఆమె గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.


‘‘సల్మాన్‌తో హీరోయిన్‌గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చినప్పటికి సినీ ప్రయాణం సులభంగా సాగలేదు. బాలీవుడ్ కండల వీరుడి వల్లనే నేను ఇక్కడ ఉన్నానని అందరు అనుకుంటున్నారు. సల్మాన్ అద్భుతమైన వ్యక్తి. బిజీగా ఉంటారు. అతడితో సన్నిహితంగా ఉంటే అన్ని పనులు అయిపోతాయని అందరు భావిస్తారు. కానీ, అది నిజం కాదు. చిన్నచిన్న విషయాలను అతడిని అడగను. నాకు సల్మాన్ మంచి స్నేహితుడు. ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటారు. ప్రతిసారి ఫోన్ చేయను’’ అని జరీన్ ఖాన్ చెప్పింది.  ‘‘వీర్’’ సినిమా విడుదలైనప్పుడు  జరీన్‌ని చూసి అందరు ఆశ్చర్యపోయారు. జరీన్‌కు అచ్చం కత్రినా కైఫ్‌లా పోలికలు ఉండటమే అందుకు కారణం.





Updated Date - 2022-01-20T22:13:40+05:30 IST