‘యుకి’ షూటింగ్‌ పూర్తి

ABN , First Publish Date - 2021-09-20T23:48:13+05:30 IST

‘మద యాని కూట్టమ్‌’, ‘పరియేరుమ్‌ పెరుమాళ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాల తర్వాత నటుడు కదిర్‌ నటించిన చిత్రం ‘యుకి’. తమిళం, మలయాళం భాషల్లో నిర్మితమైన ఈ చిత్రానికి జాక్‌ హ్యారీస్‌ దర్శకత్వం వహించారు. నరేన్‌, నట్టిలు

‘యుకి’ షూటింగ్‌ పూర్తి

‘మద యాని కూట్టమ్‌’, ‘పరియేరుమ్‌ పెరుమాళ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాల తర్వాత నటుడు కదిర్‌ నటించిన చిత్రం ‘యుకి’. తమిళం, మలయాళం భాషల్లో నిర్మితమైన ఈ చిత్రానికి జాక్‌ హ్యారీస్‌ దర్శకత్వం వహించారు. నరేన్‌, నట్టిలు ప్రధాన పాత్రలను పోషించారు. డ్రామా థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించగా, హీరోయిన్‌గా కయల్‌ ఆనందితో పాటు పలువురు నటీనటులు నటించారు. యూఏఎన్‌ ఫిల్మ్‌, జువిస్‌ ప్రొడక్షన్స్‌, ఆర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్టు చిత్ర దర్శకుడు జాక్‌ హ్యారీస్‌ వెల్లడించారు. కాగా, ఈ చిత్రానికి పక్కియరాజ్‌ రామలింగం కథను సమకూర్చగా.. రాజ్‌దాస్‌ కురియస్‌, సిజు మ్యాథ్యూ, నావిస్‌ జేవియర్‌, లవన్‌, కుసన్‌లు నిర్మాతలు. రంజిన్‌ రాజ్‌ సంగీతం సమకూర్చగా, పుష్పరాజ్‌ సంతోష్‌ కెమెరామెన్‌గా పనిచేశారు. 

Updated Date - 2021-09-20T23:48:13+05:30 IST