‘అఖండ’ చిత్రం చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందన ఇదే

నందమూరి నటసింహం బాలయ్య, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విజయఢంకా మోగిస్తోంది. బాలయ్య అభిమానులే కాక తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఈ చిత్ర విజయంతో సంబరాలను జరుపుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ట్విట్టర్ వేదికగా బాలయ్యకు, చిత్రయూనిట్‌‌‌కు అభినందనలు తెలియజేశారు.


‘‘ఇప్పుడే అఖండ చిత్రం చూశాను. ఈ చిత్రంతో రీసౌండింగ్ సక్సెస్ అందుకున్న బాల బాబాయ్‌కి, టీమ్ మొత్తానికి అభినందనలు. సినిమాలో ఎంజాయ్ చేయడానికి ఎన్నో ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి..’’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.