‘Acharya’: కొరటాలకి ఎన్టీఆర్ ఊహించని హెల్ప్!

Twitter IconWatsapp IconFacebook Icon

Acharya: కొరటాలకి ఎన్టీఆర్ ఊహించని హెల్ప్!

ఫ్లాప్ అనేదే తెలియని దర్శకుడిగా.. నాన్ బాహుబలి (Bahubali) రికార్డ్స్ అనే పదానికే క్రియేటర్‌గా కొరటాల శివ (Koratala Siva)కి ఉన్న ఇమేజ్ మాములుది కాదు. కమర్షియల్ సినిమాలని కొరటాల శివ సినిమాకి ముందు, కొరటాల శివ సినిమాకి తర్వాత అనే రేంజ్ కాంప్లిమెంట్స్ అందుకోని.. మంచి కథతో కూడా బాక్సాఫీస్ షేపులు మార్చవచ్చు అని నిరూపించిన కొరటాల శివ, ‘ఆచార్య’ (Acharya) సినిమాతో భయంకరమైన ఫ్లాప్ ఇచ్చాడు. టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలబడిన ‘ఆచార్య’ సినిమా, కొరటాల శివపై నెగిటివిటి స్ప్రెడ్ అయ్యేలా చేసింది. ఇది మాత్రమే కాకుండా ‘ఆచార్య’ మిగిల్చిన నష్టాలని కూడా కొరటాల శివనే భరించాల్సి వచ్చింది. దీంతో ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్ళాల్సిన ఎన్టీఆర్ 30 (NTR30) సినిమా డిలే అవుతోంది. 


ఆర్ధిక కష్టాల నుంచి కొరటాల శివ బయటకి రావట్లేదు, పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30 సినిమా ఏమవుతుందో కూడా ఎవరికీ తెలియట్లేదు. ఈ విషయాలని గమనించిన ఎన్టీఆర్ (NTR), ఇక లాభం లేదనుకోని కొరటాల శివకి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చాడు. ఎన్టీఆర్ 30 సినిమా కథ విషయంలో కొరటాల శివ పూర్తి స్థాయిలో లీనం కాలేకపోతున్నాడు కాబట్టి, ఆయనకి కథ విషయంలో సాయం చేయడానికి ఎన్టీఆర్ ఒక స్టార్ రైటర్‌ని టీంలోకి తెచ్చాడట. 


ఎన్టీఆర్‌కి గతంలో మంచి హిట్ ఇచ్చిన ఆ రైటర్, ఎన్టీఆర్ 30 విషయంలో కొరటాలకి సాయం చేయబోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ ఆ రైటర్ ఎవరు? అతను ఎన్టీఆర్‌కి ఏ హిట్ ఇచ్చాడు? అతను, కొరటాల శివ కలిసి మంచి కథ రాస్తారా? అసలు ఈ విషయంలో నిజమెంత? అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.