యువతరానికి నచ్చుతుంది
ABN , First Publish Date - 2021-11-27T09:08:21+05:30 IST
రమణ హీరోగా రవిచంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘పాయిజన్’ చిత్రం ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ ఏఎంబీ మాల్‌లో నిర్మాత సి.కల్యాణ్ లాంచ్ చేశారు....

రమణ హీరోగా రవిచంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘పాయిజన్’ చిత్రం ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ ఏఎంబీ మాల్‌లో నిర్మాత సి.కల్యాణ్ లాంచ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీలా అనిపించింది. ఈ చిత్రనిర్మాతలు నాకు తెలుసు. సినిమా అంటే ప్రాణం పెడతారు. చాలా రిచ్‌గా సినిమా తీశారు. హీరో రమణకు మంచి భవిష్యత్ ఉంది.ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు. ‘ట్రైలర్ బాగుంది. మ్యూజిక్ డిఫరెంట్‌గా ఉంది. ఈ సినిమాతో పరిశ్రమకు మరో మంచి హీరో దొరికాడు’ అన్నారు మరో నిర్మాత పుప్పాల రమేశ్. ఈ చిత్రం దర్శకుడు రవిచంద్రన్‌కు బ్రేక్ ఇస్తుందని మరో నిర్మాత సాయి వెంకట్ అన్నారు. హీరో రమణ మాట్లాడుతూ ‘కల్యాణ్‌గారు మాకు గురువు. ఆయన ఆశీస్సులతో ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉంది’ అన్నారు. త్వరలో మరో రెండు కొత్త సినిమాలు ప్రకటిస్తామని చిత్ర నిర్మాత శిల్పిక చెప్పారు.