Kiran Abbavaram: 2023 లైనప్ చూస్తే షాకవ్వాల్సిందే..

Twitter IconWatsapp IconFacebook Icon
Kiran Abbavaram: 2023 లైనప్ చూస్తే షాకవ్వాల్సిందే..

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ మొదలు పెట్టి ప్రస్తుతం హీరోగా చేతినిండా ఫుల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). 2019లో ‘రాజావారు రాణిగారు’ (Raja Varu Rani Garu)తో హీరోగా అరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం.. తన నటనతో, అమాయకత్వంతో  కూడిన క్యారెక్టర్‌తో యువతను ఆకట్టుకున్నాడు. 2021లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ (S.R. Kalyana Mandapam) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో.. కోవిడ్ తర్వాత థియేటర్లకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి అతన్ని కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. 2022లో కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ ‘సెబాస్టియన్ పిసి 524’ని ప్రయత్నించాడు.. అందులో అతను నైట్ బ్లైండ్ పోలీసుగా నటించాడు. ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయిగానీ.. కమర్షియల్‌గా హిట్ కాలేదు. ఆ తరువాత మే 24, 2022న విడుదలై ‘సమ్మతమే’ చిత్రం మల్టీప్లెక్స్, మహిళా ప్రేక్షకులను ఆకర్షించి.. విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఇదే సంవత్సర.. సెప్టెంబర్ 16న విడుదలైన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ డిజాస్టర్‌గా నిలిచి అతని కెరీర్‌లో కుదుపును సృష్టించింది. అతని ప్రారంభ చిత్రాల తర్వాత ప్రేక్షకులలో మంచి గుర్తింపును పొందుతున్న దశలో.. ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రం ఫెయిల్ అవ్వడంతో.. అంతకు ముందు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ట్రోల్ చేయబడ్డాడు. అతని చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుతం అతని క్రేజ్ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం కిరణ్ చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 2023లో ఆయన లైనప్ చూస్తే నిజంగా షాకవ్వాల్సిందే. (Kiran Abbavaram Movies)


కిరణ్ అబ్బవరం తదుపరి చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, ఏఎమ్ రత్నం మరియు ఏషియన్ సినిమాస్ వంటి టాప్ బ్యానర్‌లలో ఉండబోతున్నాయి. 2023 సంవత్సరంలో టాప్ బ్యానర్స్‌లో ఆయన నటించే చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ బ్యానర్స్‌లో చేసే చిత్రాలు హిట్టయితే మాత్రం అతను స్టార్ లీగ్‌లోకి ప్రవేశించడం ఖాయం. హీరోగానే కాకుండా ఇటీవల ఓ బ్రాండ్‌గా ఆయన అంబాసిడర్‌గా కూడా వ్యవహరించడం విశేషం. ఇంకొన్ని ప్రసిద్ధ బ్రాండ్స్ ఆయనని సంప్రదించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2023లో ఫిబ్రవరి 17న మహాశివరాత్రికి షెడ్యూల్ చేయబడిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro bhagyamu Vishnu Katha) విడుదల కానుండగా.. మరో 2 సినిమాలు కూడా ఇదే సంవత్సరం విడుదలయ్యేలా.. కిరణ్ అబ్బవరం తన లైనప్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడు. (Young Hero Kiran Abbavaram Next Projects)

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.