పేరు మార్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో

ABN , First Publish Date - 2022-01-26T01:41:44+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో తన పేరును మార్చుకున్నట్లుగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. డిఫరెంట్ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో..

పేరు మార్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో తన పేరును మార్చుకున్నట్లుగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. డిఫరెంట్ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అదిత్ అరుణ్. ‘వీకెండ్ లవ్’, ‘తుంగభద్ర’, ‘పీఎస్‌వీ గరుడవేగ’, ‘డియర్ మేఘ’, ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ వంటి చిత్రాలతో నటుడిగా, హీరోగా తన మార్క్‌ను ప్రదర్శిస్తున్న అదిత్ అరుణ్.. సడెన్‌గా తన పేరును త్రిగుణ్‌గా మార్చుకుంటున్నట్లుగా ప్రకటించాడు. 


తన రీసెంట్ ట్వీట్‌లో ‘ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్..’ అంటూ అనౌన్స్ చేశారు. ఇకపై తనను మీడియా మిత్రులు, చిత్ర పరిశ్రమలోని స్నేహితులు, పెద్దలు త్రిగుణ్‌గా పిలవాలని ఈ యంగ్ హీరో కోరారు. కాగా, ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘కొండా’ చిత్రంలో నటిస్తున్న త్రిగుణ్.. ఈ సినిమా తన కెరీర్‌లో డిఫరెంట్ ఫిల్మ్ అవుతుందని చెబుతున్నారు.  



Updated Date - 2022-01-26T01:41:44+05:30 IST