నువ్వే... నా బేబీ!

ABN , First Publish Date - 2022-10-04T07:28:44+05:30 IST

రంజిత్‌, సౌమ్య మీనన్‌ జంటగా రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లెహరాయి’...

నువ్వే... నా బేబీ!

రంజిత్‌, సౌమ్య మీనన్‌ జంటగా రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లెహరాయి’. మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘ఒసేయ్‌ బేబీ’ అనే గీతాన్ని సోమవారం విడుదల  చేశారు. ఘంటాడి కృష్ణ స్వరపరిచారు. కాసర్ల శ్యామ్‌ రాశారు. సాకేత్‌, కీర్తన శర్మ ఆలపించారు. ‘‘ఘంటాడి కృష్ణ సెకండ్‌ ఇన్నింగ్స్‌కి ఆరంభం ఈ చిత్రం. ఇది వరకు విడుదల చేసిన ‘గుప్పెడంత’ పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. ‘ఒసేయ్‌ బేబీ’ కూడా అందరినీ అలరిస్తుంది. ఇందులో మొత్తం ఏడు పాటలుంటాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు దర్శక నిర్మాతలు. 



Updated Date - 2022-10-04T07:28:44+05:30 IST