‘మండేలా’.. ఆస్కార్‌ అవార్డుకు షార్ట్‌లిస్ట్‌ కావడంపై యోగిబాబు స్పందనిదే

ABN , First Publish Date - 2021-10-24T00:46:43+05:30 IST

ప్రతి యేడాది ‘ఆస్కార్‌’ అవార్డుల ప్రదానోత్సవం మార్చిలో జరుగుతుంది. 2021 సంవత్సరానికిగాను ఈ అవార్డుల ప్రదానోత్సవం 27 మార్చి, 2022న జరుగనుంది. ఇందులో విదేశీ చిత్రాలు కూడా పోటీపడుతున్నాయి. ఆ కోవలో భారత్‌

‘మండేలా’.. ఆస్కార్‌ అవార్డుకు షార్ట్‌లిస్ట్‌ కావడంపై యోగిబాబు స్పందనిదే

ప్రతి యేడాది ‘ఆస్కార్‌’ అవార్డుల ప్రదానోత్సవం మార్చిలో జరుగుతుంది. 2021 సంవత్సరానికిగాను ఈ అవార్డుల ప్రదానోత్సవం 27 మార్చి, 2022న జరుగనుంది. ఇందులో విదేశీ చిత్రాలు కూడా పోటీపడుతున్నాయి. ఆ కోవలో భారత్‌ నుంచి మొత్తం 14 చిత్రాలు షార్ట్‌లిస్ట్‌ చేశారు. వీటిలో కోలీవుడ్‌ నుంచి ఒక చిత్రం ఉంది. ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు హీరోగా నటించిన చిత్రం ‘మండేలా’. ఇది థియేటర్‌లో విడుదలకాకుండా ముందు టీవీలో ప్రసారమై, ఆ తర్వాత ఓటీటీలో విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్‌ చేసిన భారతీయ చలనచిత్రాల్లో ఒకటిగా నిలిచింది.


మాడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యోగిబాబుతో పాటు షీలా రాజ్‌కుమార్‌, సంగిలి మురుగన్‌ తదితరులు నటించారు. దీనిపై యోగిబాబు స్పందిస్తూ, ‘ఒక హాస్య నటుడు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ఆస్కార్‌ అవార్డుకు షార్ట్‌లిస్ట్‌ కావడం గొప్ప విషయం. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ప్రేక్షకాదరణే కారణం. దేవుడుకి ధన్యవాదాలు’ అని యోగిబాబు అన్నారు.

Updated Date - 2021-10-24T00:46:43+05:30 IST