Yathra దర్శకుడి తదుపరి చిత్రం ఇదేనా?

ABN , First Publish Date - 2022-06-20T14:47:42+05:30 IST

‘విలేజ్‌లో వినాయకుడు (Village lo Vinayakudu), కుదిరితే కప్పుకాఫీ (Kudirithe CuP Coffee)’ చిత్రాల్ని నిర్మించిన మహి వి రాఘవ (Mahi V Raghava).. ‘పాఠశాల’ (Pathashala) చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే అతడి టేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అతడి దర్శకత్వంలోనే వచ్చిన ‘ఆనందోబ్రహ్మ’ (Anandobrahma) హారర్ కామెడీ చిత్రం మంచి విజయం సాధించింది.

Yathra దర్శకుడి తదుపరి చిత్రం ఇదేనా?

‘విలేజ్‌లో వినాయకుడు (Village lo Vinayakudu), కుదిరితే కప్పుకాఫీ (Kudirithe CuP Coffee)’ చిత్రాల్ని నిర్మించిన మహి వి రాఘవ (Mahi V Raghava).. ‘పాఠశాల’ (Pathashala) చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే అతడి టేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అతడి దర్శకత్వంలోనే వచ్చిన ‘ఆనందోబ్రహ్మ’ (Anandobrahma) హారర్ కామెడీ చిత్రం మంచి విజయం సాధించింది. ఆపై వైయస్సార్ పాదయాత్ర కథాంశంతో బయోపిక్‌గా మలిచిన ‘యాత్ర’ (Yatra) చిత్రం సూపర్ హిట్ గా నిలవడంతో దర్శకుడిగా మహి పేరు టాలీవుడ్‌లో మారుమోగింది. అందులో వైయస్సార్‌గా నటించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కి కూడా మంచి పేరొచ్చింది. ఈ సినిమా సక్సెస్ తెచ్చిపెట్టిన నూతనోత్సాహంతో మహి వి రాఘవ్.. ‘యాత్ర’ చిత్రానికి సీక్వెల్ తీస్తు్న్నట్టు వార్తలొచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు, పాదయాత్ర తదితర విషయాల గురించి ‘యాత్ర 2’ చిత్రం తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం పక్కనపెట్టారు. 


తాజాగా మహి వి రాఘవ మరో సరికొత్త కథాంశంతో సినిమా తీస్తున్నట్టు టాక్. మూడేళ్ళ క్రితం నయనతార కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘అరమ్’ (Aram) మంచి సక్సెస్ అయింది. గోపీ నయనార్ (Gopi Nayanar) దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘కర్తవ్యం’ (Karthavyam) పేరుతో విడుదలైంది. అయితే ఇక్కడంతగా ఆడలేదు. బోర్ బావిలో పడ్డ చిన్నారి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. జిల్లా కలెక్టర్ అయిన నయనతార ఆ చిన్నారిని బోరుబావి నుంచి వెలికితీయడానికి ఎలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది అనేది కథ. సినిమా ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి కథాంశంతోనే మహి వి రాఘవ.. ఓ సినిమా తీయబోతున్నట్టు సమాచారం. అయితే ఆయన డిఫరెంట్ యాంగిల్‌లో, డిఫరెంట్ స్ర్కీన్ ప్లేతో  అలాంటి కథాంశాన్ని తెరకెక్కించబోతున్నట్టు వినికిడి. 


నిజానికి ఇలాంటి కథాంశంతోనే 1990లో మలయాళంలో ‘మాలూట్టి’ (Malootty) అనే మూవీ వచ్చింది. అందులో జయరాం (Jayaram), ఊర్వశి (Urvashi) భార్యాభర్తలు గా నటించారు. వారి పాపగా బేబీ షామిలీ (Baby Shamili) నటించింది. ఆ అమ్మాయి ఆరుబైట తన కుక్కతో ఆడుకుంటూ ఉండగా.. ఓ బోరుబావిలో పడిపోతుంది. దాంతో ఆ అమ్మాయి తండ్రి తన కూతురిని బైటికి తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నదే కథాంశం. నిజానికి ఈ సినిమా.. హాలీవుడ్ టీవీ ఫిల్మ్ ‘ఎవ్రిబడీస్ బేబీ : ది రెస్క్యూ ఆఫ్ జెస్సికా మెక్‌క్లైర్ (Everybody's Baby: The Rescue of Jessica McClure) కు ఆధారం. ఇప్పుడు అలాంటి కథాంశంతో తెలుగులో సినిమా రావడం విశేషం. ఆల్రెడీ స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేశాడట దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరి ఈ కథాంశం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

Updated Date - 2022-06-20T14:47:42+05:30 IST