ఓటీటీలో 400 కోట్ల ఆపర్... ఒప్పుకోని స్టార్ ప్రొడ్యూసర్!

ABN , First Publish Date - 2021-09-24T21:24:24+05:30 IST

కరోనా తరువాత సినిమా రంగం అనేక చిక్కుల్లో పడింది. నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు... ఇలా అందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, అందరికంటే ఎక్కువగా నిర్మాతలు చతికిలపడ్డారు. ఎందుకంటే, వారు పెట్టిన వందలు, వేల కోట్ల పెట్టుబడులు నెలల తరబడి ఆగిపోయాయి.

ఓటీటీలో 400 కోట్ల ఆపర్... ఒప్పుకోని స్టార్ ప్రొడ్యూసర్!

కరోనా తరువాత సినిమా రంగం అనేక చిక్కుల్లో పడింది. నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు... ఇలా అందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, అందరికంటే ఎక్కువగా నిర్మాతలు చతికిలపడ్డారు. ఎందుకంటే, వారు పెట్టిన వందలు, వేల కోట్ల పెట్టుబడులు నెలల తరబడి ఆగిపోయాయి. కానీ, అదే సమయంలో చాలా మంది నిర్మాతలకి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ గొప్ప వరంలా ఎదురొచ్చాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని రకాలు సినిమాలు ఇప్పుడు డిజిటల్‌గా రిలీజ్ అవుతున్నాయి. కానీ, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా మాత్రం ఓటీటీకి బేరాలకు ససేమీరా అంటున్నాడట. 


యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఒకేసారి చాలా సినిమాలు నిర్మిస్తుంటాడు. ప్రస్తుతం ఆయన వద్ద నాలుగు క్రేజీ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అవి... ‘షంషేరా, పృథ్వీరాజ్, జయేశ్ భాయ్ జోర్ధార్, బంటీ ఔర్ బబ్లీ 2’. ఈ సినిమాలు అన్నీ కలిపి తమకు అమ్మేస్తే ఏకంగా 400 కోట్లు ఇస్తామన్నారట అమేజాన్ వారు. అయినా కూడా, ఆది చోప్రా అమేజాన్ ప్రైమ్‌కు అమ్మే ప్రసక్తే లేదని చెప్పాడట! 


మహారాష్ట్రలో ఇంకా థియేటర్లు తెరవటంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో చాలా బాలీవుడ్ సినిమాలు ఎలా విడుదల చేయాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ సందిగ్ధ స్థితినే ఓటీటీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ప్రొడ్యూసర్స్‌కి పెద్ద మొత్తంలో డబ్బుల ఆశ చూపి టోకుగా కొనేస్తున్నాయి. కానీ, అటువంటి పప్పులేం తన వద్ద ఉడకవంటున్నాడు యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా. 400 కోట్లు ఇస్తామన్నా సూటిగా నో చెప్పాడట. అమేజాన్ మాత్రమే కాదు ఇంకా పలు డిజిటల్ వేదికలకి కూడా ఆదిత్య చోప్రా వద్ద నిరాశే ఎదురైంది. త్వరలోనే తమ నాలుగు క్రేజీ చిత్రాల విడుదల తేదీలు ప్రకటిస్తామంటున్నారు ఆది అండ్ హిజ్ టీమ్. చూడాలి మరి, ఓటీటీ బంపర్ ఆఫర్ వద్దనుకున్న స్టార్ ప్రొడ్యూసర్‌కి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం కలుగుతుందో...  

Updated Date - 2021-09-24T21:24:24+05:30 IST