సముద్రగర్భంలో ‘యానై’ పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-09-19T06:13:01+05:30 IST

ప్రముఖ నటుడు అరుణ్‌ విజయ్‌, మాస్‌ డైరెక్టర్‌ హరి కాంబినేషన్‌లో తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపుదిద్దుకుంటున్న ‘యానై’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు.

సముద్రగర్భంలో ‘యానై’ పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రముఖ నటుడు అరుణ్‌ విజయ్‌, మాస్‌ డైరెక్టర్‌ హరి కాంబినేషన్‌లో తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపుదిద్దుకుంటున్న ‘యానై’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. అయితే, ఈ చిత్రం పోస్టరు ఆవిష్కరణను అరుణ్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ విభిన్నంగా నిర్వహించారు. శనివారం పుదుచ్చేరికి చెందిన అరుణ్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ ‘యానై’ పోస్టరును సముద్రగర్భంలో ఆవిష్కరించారు. ఈ తరహాలో పోస్టరును ఆవిష్కరించడం ఇదే తొలిసారని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుండగా, సీనియర్‌ నటీనటులు సముద్రఖని, రాధిక, యోగిబాబు తదితరులు కూడా నటిస్తున్నారు.     

- ఆంధ్రజ్యోతి, చెన్నై

Updated Date - 2021-09-19T06:13:01+05:30 IST