తన పెళ్లి నాటి సంగతులు వివరించిన ఉరీ హీరోయిన్ యామీ గౌతమ్
ABN , First Publish Date - 2021-11-28T21:34:36+05:30 IST
యామీ గౌతమ్ నవంబర్ 28న పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఆమె గత ఏడాది ఆదిత్య ధర్‌ను పెళ్లి చేసుకుంది. తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఈ వివాహం

యామీ గౌతమ్ నవంబర్ 28న పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఆమె గత ఏడాది ఆదిత్య ధర్‌ను పెళ్లి చేసుకుంది. తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఈ వివాహం జరిగింది. బాలీవుడ్‌లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’’ సినిమాకు ఆదిత్య దర్శకత్వం వహించారు. విక్కీ కౌశల్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ఆమె అండర కవర్ రా ఏజెంట్‌గా పనిచేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కలిసి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు.
తాజాగా యామీ గౌతమ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. తన నాటి సంగతులను అభిమానులతో పంచుకుంది. ‘‘మా పెళ్లిని హంగులు, అర్భాటాలు లేకుండా సన్నిహితుల మధ్యనే జరుపుకున్నాం. దాదాపుగా 20మంది కుటుంబ సభ్యుల మధ్యనే మా వివాహాన్ని చేసుకున్నాం. నాకు భారీ వేదికల్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. మీరు చేసే పనుల నుంచే మీకు గౌరవం లభిస్తుంది. మొత్తానికి పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఉండాలి. ప్రస్తుతం మేం సంతోషంగానే ఉన్నాం. మా కుటుంబాలు కూడా ఆనందంగానే ఉన్నాయి. మన సాంప్రదాయాలు నాకు చాలా ముఖ్యం. ఒక వేళ కరోనా లేకపోయినప్పటికీ మా పెళ్లి ఆ విధంగానే జరిగేది ’’ అని యామీ గౌతమ్ చెప్పింది.
‘‘ నేను పెళ్లి చేసుకునే సమయానికి మా నాన్నమ్మ చీరను కుట్టి రెడీగా ఉంచింది. నా కొలతలు మీకెలా తెలుసు అని ఆమెను అడిగాను. నువ్వు డిజైనర్ వేర్ ధరించడం లేదు కనుక అంచనాతో ఆ విధంగా కుట్టానని చెప్పింది. మీ పెళ్లిలో అందరిని సంతోష పెట్టాలంటే అది అసంభవం. మీరు అనుకున్న విధంగా మీ పెళ్లిని చేసుకోవాలి ’’ అని యామీ పేర్కొంది.