మరో ప్రేమకథ రాస్తున్నా: దర్శకుడు శివ నిర్వాణ

ABN , First Publish Date - 2021-09-25T19:13:31+05:30 IST

'నిన్నుకోరి', 'మజిలీ', 'టక్ జగదీష్' సినిమాలతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు శివ నిర్వాణ. ఆయన ప్రస్తుతం మరో చక్కటి ప్రేమకథను రాస్తున్నట్టు తాజాగా తెలిపారు.

మరో ప్రేమకథ రాస్తున్నా: దర్శకుడు శివ నిర్వాణ

'నిన్నుకోరి', 'మజిలీ', 'టక్ జగదీష్' సినిమాలతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు శివ నిర్వాణ. ఆయన ప్రస్తుతం మరో చక్కటి ప్రేమకథను రాస్తున్నట్టు తాజాగా తెలిపారు. నాని - నివేత థామస్ - ఆది పినిశెట్టిలతో 'నిన్నుకోరి', నాగ చైతన్య - సమంతలతో 'మజిలీ' చిత్రాలలో చక్కటి ప్రేమకథను చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల వచ్చిన 'టక్ జగదీష్' మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ వచ్చింది. అందుకు కారణం దర్శకుడు శివ నిర్వాణ ఈ  సినిమాను కాస్త మాస్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ పథాలో రూపొందించడమే. పైగా కథ కూడా అందరికీ తెలిసిందే కావడం కొద్దిగా మైనస్ అయింది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా వెంటనే మరో కథను సిద్దం చేసేపనిలో పడ్డారు. నా నుంచి వచ్చిన 'నిన్నుకోరి', 'మజిలీ' తరహాలోనే అద్భుతమైన ప్రేమకథ రాస్తున్నట్టు ఓ వీడియోలో తెలిపారు. 



Updated Date - 2021-09-25T19:13:31+05:30 IST