నా వచన కవిత్వం మెగాస్టార్ పలికిన తీరు అత్యద్భుతం : లక్ష్మీ‌భూపాల

ABN , First Publish Date - 2021-10-26T20:03:25+05:30 IST

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజా చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ సూపర్ హిట్ చిత్రం ‘నటసామ్రాట్’ కిది రీమేక్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఇంకా బ్రహ్మానందం, అనసూయ, పునర్ణవి భూపాలం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఒక థియేటర్ ఆర్టిస్ట్ తన వార్ధక్యంలో పడే కష్టాల నేపథ్యంలో కథ సాగుతుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కృష్ణ వంశీ ఈ కథకి తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేశారు.

నా వచన కవిత్వం మెగాస్టార్ పలికిన తీరు అత్యద్భుతం : లక్ష్మీ‌భూపాల

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజా చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ సూపర్ హిట్ చిత్రం ‘నటసామ్రాట్’ కిది రీమేక్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఇంకా బ్రహ్మానందం, అనసూయ, పునర్ణవి భూపాలం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఒక థియేటర్ ఆర్టిస్ట్ తన వార్ధక్యంలో పడే కష్టాల నేపథ్యంలో కథ సాగుతుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కృష్ణ వంశీ ఈ కథకి తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేశారు. ఇక ఈ సినిమాకోసం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇచ్చారని తెలుపుతూ ఈరోజు కృష్ణవంశీ ట్వీట్ చేశారు. అయితే ఇందులో మెగాస్టార్ పలికింది తాను రాసిన వచన కవిత్వమని ప్రముఖ డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ లో తెలిపారు. 



‘ఈ సినిమా థీమ్ కోసం నేను రాసిన వచన కవిత్వం మెగాస్టార్ చిరంజీవి గారి నోట పలికింది.. ఎంతో శ్రద్ధగా పదం పదం చదివి అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ఆవాహన చేసుకుని మెగాస్టార్ పలికిన తీరు అత్యద్భుతం.. ఒక నటుడి జీవితాన్ని ఆవిష్కరించే 'రంగమార్తాండ' సినిమాలో,  మెగాస్టార్ లాంటి గొప్ప నటుడి గొంతు నా పదాలు పలకడం చాలా చాలా సంతోషంగా ఉంది.. రాసినప్పుడు దర్శకులు కృష్ణవంశీ అభినందన నా రచనకు శాలువా కప్పినట్టైతే, చిరంజీవి గారు చెప్పడం గజమాలవేసి ఏనుగు అంబారీ ఎక్కినట్టుంది..ఇంత చెప్పిన నేను, మెగాస్టార్ చేతిలో ఉన్న కాగితాల్లో ఏం రాసానో కూడా చెప్పేయాలని ఉంది కానీ, సినిమా వచ్చేవరకు ఆగమని అన్నయ్య కృష్ణవంశీ ఆర్డర్ కాబట్టి ప్రస్తుతానికి ఈ ఆనందం మాత్రం పంచుకుంటున్నాను’ అంటూ లక్ష్మీ భూపాల తెలిపారు. 



Updated Date - 2021-10-26T20:03:25+05:30 IST