వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ టాలీవుడ్ సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. జూబ్లీ హిల్స్ పరిధిలోని వెంకటగిరిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వివిధ యూనియన్స్ కు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. నాలుగేళ్ళుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని, దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం తలకు మించిన భారమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వేతనాల్లో 30 శాతం పెరుగుదల ఉంటనే కానీ.. తమ సమస్య పరిష్కారం కాదని తెలుపుతూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికులు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో .. భారీగా పోలీసుల్ని మోహరించారు.