మాట సాయం!
ABN , First Publish Date - 2022-03-30T06:56:34+05:30 IST
తాప్సి ప్రధాన పాత్ర పోషించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రానికి యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి వాయిస్ ఓవర్ అందించారు...

తాప్సి ప్రధాన పాత్ర పోషించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రానికి యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి వాయిస్ ఓవర్ అందించారు. చిత్రనిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ విషయాన్ని తెలిపింది. చాలా కాలం తర్వాత తాప్సి తెలుగులో మళ్లీ నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్ర దర్శకుడు స్వరూప్ రూపొందించారు. వినోదంతో పాటు ఊహించని కొన్ని ట్విస్టులు ఈ చిత్రంలో ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి వాయిస్ ఓవర్ కచ్చితంగా బోనస్ అవుతుందని చిత్ర బృందం తెలిపింది. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్‌తో అద్భుతమైన స్పందన అందుకున్న ఈ చిత్రం ఏప్రిల్ ఒకటిన విడుదలవుతోంది. నమ్మశక్యంకాని ఓ నిజమైన సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రంలో రవీందర్ విజయ్, హరీశ్ పరేడి, రిషబ్ శెట్టి తదితరులు నటించారు. ఎన్.ఎం.పాషా సహనిర్మాత. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మాతలు.