క్లియోపాత్రని ఇప్పటి వరకు అలా చూశారు.. ఇందులో మరోలా చూస్తారు : వండర్ వుమెన్ స్టార్

గాల్ గాడెట్ అంటే ఎవరూ గుర్తు పట్టలేకపోవచ్చు. కానీ ‘వండర్ వుమెన్’ అంటే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. డీసీ కామిక్ క్యారెక్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించింది గాల్ గాడెట్. ఇటీవలే ఈ భామ నటించిన ‘రెడ్ నోటీస్’ విడుదలై మంచి టాక్‌నే సొంతం చేసుకుంది.


గాల్ గాడెట్ ప్రస్తుతం ‘వండర్ వుమెన్’ డైరెక్టర్ నిర్మాతగా చేస్తున్న ఓ మూవీలో క్లియెపాత్రాగా నటిస్తోంది. ఈ సినిమా గురించి ఓ ఇటర్వ్యూలో మాట్లాడింది ఈ బ్యూటీ. ‘ఈ మూవీ గురించి ఎక్కువగా చెప్పలేను. కానీ ఈ క్లియోపాత్ర స్టోరీ ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. అది మాత్రం చెప్పగలను. ఇప్పటివరకు క్లయోని సెక్సీ, అందమైక మహిళగానే చూపించారు. కానీ ఇందులో మాత్రం మరో కోణంలో ఆమె తెలివి తేటలు, ప్లానులు ఇప్పటి వరకు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో చూపబోతున్నామ‌’ని తెలిపింది.

‘క్లియోపాత్ర అంటే ఇప్పటివరకు 1963లో నటించిన ఎలిజబెత్ టెలరే గుర్తొస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం ఇంతకుముందు వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. గత చిత్రాల్ల కాకుండా ప్రపంచానికి అవసరమైన దాన్ని ఇందులో చూపబోతున్నాం. నిజానికి మెసడోనియన్ మహిళ ఈ పాత్రకి అవసరం. కానీ అలాంటి నటి దొరకకపోవడం, నాకు ప్యాషన్ ఉండడంతో ఈ క్యారెక్టర్ చేస్తున్నాన’ని ఈ భామ చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా స్నేహితుల గురించి ఈ అందగత్తె మాట్లాడుతూ.. ‘నాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు ఉన్నారు. వాళ్లలో ముస్లింలు, క్రిస్టియన్లు, క్యాథలిక్‌లు, నాస్తికులు, బౌద్ధులు లేదా యూదులు ఉన్నారు. ఏది ఏమైనా అందరూ మనుషులే. అందరితో కలిసి అందరికి నచ్చే, అందరూ మెచ్చేలా ఈ చిత్రాన్ని చేయాలని’ అనుకుంటున్నట్లు పేర్కొంది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.