వైష్ణవ్‌ తేజ్‌తో.. రంగ రంగ వైభవంగా!

ABN , First Publish Date - 2022-01-25T05:55:28+05:30 IST

‘ఉప్పెన’తో తొలి అడుగులోనే సూపర్‌ హిట్‌ కొట్టాడు వైష్ణవ్‌తేజ్‌. ఆ విజయంతో యువ హీరోల పక్కన తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు...

వైష్ణవ్‌ తేజ్‌తో.. రంగ రంగ వైభవంగా!

‘ఉప్పెన’తో తొలి అడుగులోనే సూపర్‌ హిట్‌ కొట్టాడు వైష్ణవ్‌తేజ్‌. ఆ విజయంతో యువ హీరోల పక్కన తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు వైష్ణవ్‌ తేజ్‌తో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. కేతికా శర్మ కథానాయిక. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే పేరు ఖరారు చేశారు. సోమవారం టైటిల్‌ టీజర్‌, ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యాయి. టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. బటర్‌ ఫ్లై కిస్‌.. అంటూ హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ర్టీని రొమాంటిక్‌గా చూపించిన విధానం ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌దత్‌, సమర్పణ: బాపినీడు బి.


Updated Date - 2022-01-25T05:55:28+05:30 IST