సింఫనీ ఆర్కెస్ట్రాతో...

ABN , First Publish Date - 2021-10-12T06:19:45+05:30 IST

సత్యదేవ్‌, నిత్యా మీనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘స్కైలాబ్‌’. విశ్వక్‌ ఖండేరావు దర్శకుడు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉంది...

సింఫనీ ఆర్కెస్ట్రాతో...

సత్యదేవ్‌, నిత్యా మీనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘స్కైలాబ్‌’. విశ్వక్‌ ఖండేరావు దర్శకుడు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉంది. ఈ నెలలో ట్రైలర్‌, త్వరలో థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశ్వక్‌ ఖండేరావు మాట్లాడుతూ ‘‘నాసా ప్రయోగించిన స్పేస్‌ స్టేషన్‌ స్కైలాబ్‌ భూమ్మీద పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలొచ్చాయి. ఆ స్కైలాబ్‌ వల్ల తెలుగు రాష్ట్రంలోని బండపల్లి అనే గ్రామంలో నివసించే గౌరి, ఆనంద్‌, రామారావు జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథతో వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. కథ 1979లో సాగుతుంది. మెసడోనియన్‌ సింఫనీ ఆర్కెస్ట్రాతో ఇటీవల సినిమాలో థీమ్స్‌ రికార్డు చేయించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీత దర్శకుడు.


Updated Date - 2021-10-12T06:19:45+05:30 IST