ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలతో...

ABN , First Publish Date - 2022-01-27T05:34:41+05:30 IST

రామ, రావణ తరహా పాత్రలో సాయిరామ్‌ శంకర్‌ నటిస్తున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’ చిత్రం పోస్టర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు...

ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలతో...

రామ, రావణ తరహా పాత్రలో సాయిరామ్‌ శంకర్‌ నటిస్తున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’ చిత్రం పోస్టర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు. సినిమా కాన్సెప్ట్‌ను పోస్టర్‌లోనే చూపించారు మేకర్స్‌. సాయిరామ్‌ శంకర్‌ కొత్తగా కనిపిస్తున్న ఈ చిత్రంలో  అశీమా నర్వాల్‌ హీరోయిన్‌.  జాతీయ అవార్డు గ్రహీత వినోద్‌ విజయన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిగా కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌గా ‘ఒక పథకం ప్రకారం’ చిత్రం ఉంటుందనీ, దర్శకుడు వినోద్‌ విజయన్‌,  ఎడిటర్‌ కార్తీక్‌ జోగేష్‌ సహా మరో నలుగురు జాతీయ అవార్డు గ్రహీతలు ఈ సినిమాకు పనిచేస్తున్నారని నిర్మాతలు వినోద్‌ విజయన్‌, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేశ్‌ చెప్పారు.


Updated Date - 2022-01-27T05:34:41+05:30 IST