విశ్వక్సేన్ కథానాయకుడిగా సీనియర్ నటుడు అర్జున్ కథను అందిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న నూతన చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమానికి పవన్‌కల్యాణ్ హాజరై క్లాప్ కొట్టారు. అర్జున్ తనయ ఐశ్వర్యా అర్జున్ తెలుగులో కథానాయికగా పరిచయ మవుతున్నారు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు.