అన్నాచెల్లెళ్ల అనుబంధంతో...

నవీన్‌చంద్ర, అవికాగోర్‌ అన్నాచెల్లెళ్లుగా నటించిన ‘బ్రో’ చిత్రం గత నెల 26న డైరెక్ట్‌గా సోని లివ్‌లో స్ట్రీమింగ్‌ అయింది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్‌ సమక్షంలో నిర్మాత రవిచంద్‌ సోమవారం సాయంత్రం సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీశాను. అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని వివరించే సినిమా ఇది. అన్నయ్యే తనకు అన్నీ అనుకునే చెల్లెలి పాత్రలో అవికా గోర్‌,  చెల్లెల్ని ఎంతో ప్రేమించే అన్న పాత్రలో నవీన్‌చంద్ర అద్భుతంగా నటించారు. ఈ సినిమాను ఆదిరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అన్నారు. మరాఠిలో వచ్చిన ‘హ్యాపీ బ్రదర్‌’ సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ కథను యథాతథంగా ఉపయోగించకుండా కొన్ని మార్పులు, చేర్పులతో కథ తయారు చేశాను. కథలోని ఎమోషన్స్‌ అందరికీ కనెక్ట్‌ అయ్యాయి కనుకే చిత్రం ఆదరణ పొందుతోంది’ అన్నారు దర్శకుడు కార్తీక్‌ తుపురాని.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.