థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో..

ABN , First Publish Date - 2022-01-27T05:35:45+05:30 IST

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా, వర్ణ విశ్వనాథ్‌ హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటున్న డిఫరెంట్‌ మూవీ ‘11:11’ మోషన్‌ పోస్టర్‌ను...

థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో..

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా, వర్ణ విశ్వనాథ్‌ హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటున్న డిఫరెంట్‌ మూవీ ‘11:11’ మోషన్‌ పోస్టర్‌ను రానా విడుదల చేశారు. ఇందులో  కేవలం మూడు క్యారెక్టర్స్‌ చూపించి సినిమా మీద ఆసక్తి పెంచారు. థిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేశ్‌ (బళ్లారి)ఈ చిత్రాన్ని నిర్మించారు. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు.


Updated Date - 2022-01-27T05:35:45+05:30 IST