ఓ విభిన్నమైన కథతో

ABN , First Publish Date - 2021-11-08T05:42:44+05:30 IST

శ్రీకాంత్‌ అయ్యంగార్‌, లోహిత్‌ కుమార్‌, కిరణ్‌, ఇనయ సుల్తానా ప్రధాన పాత్రధారులుగా ప్రసన్న భూమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది....

ఓ విభిన్నమైన కథతో

శ్రీకాంత్‌ అయ్యంగార్‌, లోహిత్‌ కుమార్‌, కిరణ్‌, ఇనయ సుల్తానా ప్రధాన పాత్రధారులుగా ప్రసన్న భూమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. రమేష్‌ జక్కాల దర్శకుడు. లక్ష్మీ ప్రసన్నభూమి నిర్మాత. ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. కథకు ఎవరైతే సరిపోతారో, వాళ్లనే నటీనటులుగా ఎంచుకున్నాం. డిసెంబరులోగా షూటింగ్‌ పూర్తవుతుంది. ఫిబ్రవరిలో విడుదల చేస్తామ’’న్నారు.


Updated Date - 2021-11-08T05:42:44+05:30 IST