కరోనా బారిన పడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. వారిరువురు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆయన కోరారు.
‘‘కరోనా మహమ్మారి నుండి నారా చంద్రబాబుగారు, నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని వేగంగా కోలుకుంటారని భావిస్తున్నాను..’’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.