నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ విడుదలయ్యేది అప్పుడేనా..?

ABN , First Publish Date - 2021-09-15T14:32:25+05:30 IST

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న సినిమా ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఈ సినిమా విడుదలకి సంబంధించిన న్యూస్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ విడుదలయ్యేది అప్పుడేనా..?

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న సినిమా ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఈ సినిమా విడుదలకి సంబంధించిన న్యూస్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిత్ర షూటింగ్ ముగిసినట్టు యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో అందరూ రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియిన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ నెల చివరి వారంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నటు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు 'అంటే.. సుందరానికి' అనే సినిమాలో నటిస్తున్నాడు నాని. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. 

Updated Date - 2021-09-15T14:32:25+05:30 IST