‘నాడోడిగళ్ 3’ రానుందా..?

సముద్రఖని దర్శకత్వంలో శశికుమార్‌, అనన్య, అభినయ, గంజా కరుప్పు తదితరులు కీలక పాత్రల్టో నటించిన చిత్రం‘నాడోడిగళ్‌’. 2009లో విడుదలైన ఈ చిత్రానికి 12 ఏళ్లు పూర్తయింది. మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా నిర్మాతకు లాభాల పంట పండించింది. అయితే, ఈ చిత్రం విడుదలై పుష్కరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు సముద్రఖని ట్వీట్‌ చేయగా, దీనికి శశికుమార్‌ రీట్వీట్‌ చేస్తూ, ‘నాడోడిగళ్‌’ ప్రయాణం కొనసాగాలి అంటూ కామెంట్స్‌ చేశారు. అలాగే, సముద్రఖనితో దిగిన ఓ ఫొటోను శశికుమార్‌ షేర్‌ చేశారు. దీంతో ‘నాడోడిగళ్‌’ చిత్రం మూడో భాగం వస్తుందా? అనే చర్చ కోలీవుడ్‌లో మొదలైంది. అలాగే, నెటిజన్లు కూడా శశికుమార్‌ ట్వీట్‌పై పలు రకాలైన కామెంట్స్‌ చేశారు. దీంతో ఖచ్చితంగా ఈ చిత్రం మూడో భాగం వస్తుం దన్న నమ్మకంతో అభిమానులు ఉన్నారు. కాగా, వీరిద్దరి కాంబినేషన్‌లో గత 2019లో ‘నాడోడిగళ్‌’ రెండో భాగం వచ్చిన విషయం తెల్సిందే. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.