Kriti Sanon ని 'ఆదిపురుష్' ఇక్కడ నిలబెడుతుందా..?

ABN , First Publish Date - 2022-09-01T14:23:44+05:30 IST

కృతి సనన్(Kriti Sanon)..ఆదిపురుష్ (Adipurush) సినిమాతోనైనా సౌత్‌లో సత్తా చాటుందా..? అని కొందరు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

Kriti Sanon ని 'ఆదిపురుష్' ఇక్కడ నిలబెడుతుందా..?

కృతి సనన్(Kriti Sanon)..ఆదిపురుష్ (Adipurush) సినిమాతోనైనా సౌత్‌లో సత్తా చాటుందా..? అని కొందరు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. కృతి సనన్ తెలుగులో నటించిన మొదటి సినిమా 1 నేనొక్కడినే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా ఇది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. అయితే, పర్ఫార్మెన్స్, డాన్స్ పరంగా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.


దాంతో రెండవ సినిమా అక్కినేని నాగ చైతన్య సరసన నటించే అవకాశం అందుకుంది. ఆ సినిమానే దోచేయ్. సుధీర్ వర్మ రచన, దర్శకత్వం వహించిన ఈ మూవీ అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. ఇలా కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు వరుసగా ఫ్లాపవడంతో మళ్ళీ ఇక్కడ అవకాశాలు దక్కలేదు. అసలే మన వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రారంభంలోనే ఫ్లాప్స్ పడితే తీసి పక్కన పెట్టేస్తారు. కృతి సనన్ విషయంలోనూ అదే జరిగింది.


ఇక మళ్ళీ ఇంతకాలానికి ఏకంగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ ఛాన్స్ రావడానికి మేకర్స్ పాన్ ఇండియా లెవల్‌లో అలాగే, బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్ఠిలో పెట్టుకొనే కృతి సనన్‌ని ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రకు ఎంచుకున్నారు. కథ - కథనం ఆసక్తికరంగా ఉంటే బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తుందనడంలో సందేహం లేదు. అయితే, గత రెండు సినిమాల ఫలితంగా సౌత్‌లో.. మరీ ముఖ్యంగా తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. కాగా, ఈ మూవీని ఓ రౌత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఇందులో రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ కనిపించబోతున్నారు.  

Updated Date - 2022-09-01T14:23:44+05:30 IST