'ఇందువదన' వరుణ్ సందేశ్‌కి బ్రేక్ ఇస్తుందా..?

'ఇందువదన' యంగ్ హీరో వరుణ్ సందేశ్‌కి బ్రేక్ ఇస్తుందా..అనే చర్చలు ఫిల్మ్ సర్కిల్స్‌లో సాగుతున్నాయట. 'హ్యాపీడేస్' సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయమైన వరుణ్ సందేశ్‌ ఆ తర్వాత 'కొత్త బంగారు లోకం' సినిమాతో యూత్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత మళ్ళీ భారీ హిట్ వరుణ్ ఖాతాలో పడలేదు. 'కుర్రాడు', 'మరో చరిత్ర', 'ఎవరైనా ఎపుడైనా', 'ఎమైంది ఈ వేళ', 'కుదిరితే కప్పు కాఫీ', 'ఛమ్మక్ చల్లో' ..లాంటి యూత్‌ఫుల్ లవ్ స్టోరిస్స్ చేశాడు. చెసిన సినిమాలన్ని సక్సెస్ అందుకోకపోవడంతో నెమ్మదిగా ఈ యంగ్ హీరో ఫేడౌట్ అయ్యాడు. 

అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో 'ఇందువదన' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు వరుణ్ సందేశ్. ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య, సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజై ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాదు బోల్డ్ కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పోస్టర్ చాలా రొమాంటిక్‌గా ఉంటడంతో ఇప్పటివరకు లవర్ బాయ్‌గా నటించిన వరుణ్ సందేశ్‌కి ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్స్ సూటవుతాయా అనే సందేహాలు కొందరిలో కలుగుతున్నాయట. ఈ మధ్య కాలంలో ఇటువంటి కంటెంట్‌తో వచ్చిన సినిమాలు సక్సెస్ అయింది చాలా తక్కువ. చూడాలి మరి 'ఇందువదన' వరుణ్ సందేశ్‌కి ఎలాంటి ఫలితాన్నిస్తుందో.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.