డైరెక్షన్ చేస్తా : నివేత పేతురాజ్

ABN , First Publish Date - 2021-07-19T14:48:58+05:30 IST

డైరెక్షన్ చేస్తానంటున్నారు యంగ్ బ్యూటీ నివేత పేతురాజ్. ప్రస్తుతం ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా మారే ప్రయత్నాలలో ఉన్నారు. అందం అభియం ఉన్న నివేతకి సోలో హీరోయిన్‌గా సాలీడ్ హిట్ దక్కలేదు.

డైరెక్షన్ చేస్తా : నివేత పేతురాజ్

డైరెక్షన్ చేస్తానంటున్నారు యంగ్ బ్యూటీ నివేత పేతురాజ్. ప్రస్తుతం ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా మారే ప్రయత్నాలలో ఉన్నారు. అందం అభియం ఉన్న నివేతకి సోలో హీరోయిన్‌గా సాలీడ్ హిట్ దక్కలేదు. చేస్తున్నవన్నీ సెకండ్ లీడ్ రోల్స్ మాత్రమే. యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'మెంటల్ మదిలో' చిత్రంతో తెలుగుతెరకి పరిచయమయిన ఈమె 'బ్రోచేవారెవరురా', 'అల వైకుంఠపురములో', 'రెడ్' లాంటి సినిమాలలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం నివేత తాపత్రయమంతా స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకోవాలనే. ఇక తనకి డైరెక్షన్ చేయడం అంటే చాలా ఇష్టమని చెబుతోంది. కొంతకాలం హీరోయిన్‌గా సినిమాలు చేసి ఆ తర్వాత కథ సిద్దం చేసుకొని డైరెక్షన్ చేస్తానని సన్నిహిత వర్గాల వద్ద చెబుతోందట. సినిమా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్‌గా పెద్ద హిట్స్ ఇచ్చినవాల్ళు ఉన్నారు. ఆ లిస్ట్‌లో నివేత పేతురాజ్ కూడా చేరుతుందా చూడాలి. ఇక ఈ బ్యూటీ తమిళ సినిమాలు కూడా చేస్తూ కోలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

Updated Date - 2021-07-19T14:48:58+05:30 IST